Adam Zampa : వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో ఈ మిస్టర లెగ్ స్పిన్నర్ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) రికార్డు సమం చేశాడు. 2007 ఎడిషన్‌లో ముత్తయ్య…

Adam Zampa : వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో ఈ మిస్టర లెగ్ స్పిన్నర్ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) రికార్డు సమం చేశాడు. 2007 ఎడిషన్‌లో ముత్తయ్య 4.14 ఎకానమీతో 23 వికెట్లు కూల్చగా.. జంపా 11 మ్యాచుల్లో 5.36 ఎకానమీతో 23 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్
భారత్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఫైనల్లో జంపా బుమ్రా(1) వికెట్ తీశాడు. దాంతో, మురళీధరన్ సరసన నిలిచాడు. అయితే.. ఒకే ఎడిషన్‌లో రెండో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ బ్రాడ్ హాగ్(2007), పాకిస్థాన్ లెజెండ్ షాహీద్ ఆఫ్రిది(2011) కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ ఆయా ఎడిషన్లలో 21 వికెట్లతో సత్తా చాటారు.
విదేశీ బౌలర్‌గా మరో రికార్డు
మరోవిషయం ఏంటంటే..? భారత గడ్డపై వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా జంపా మరో రికార్డు నెలకొల్పాడు. ఈ లెగ్ స్పిన్నర్ 27 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా చూస్తే 96 వన్డేల్లో జంపా 165 వికెట్లు పడగొట్టాడు. అందులో 11 నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం.
ఇవి కూడా చదవండి
First appeared on www.ntnews.com