Jasprit Bumrah: వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలై కోట్లాది అభిమానులను నిరాశపర్చింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన భారత జట్టు తుది అంకంలో చతికిల పడింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత బౌలింగ్ దళం అంచనాలకు మించి రాణించింది. టీమిండియా ఫైనల్ చేరుకోవడంలో షమీతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించారు. ప్రత్యేకమైన బౌలింగ్ శైలితో నిలకడగా యార్కర్లను సందించే సామర్థ్యం బుమ్రా సొంతం. భారత జట్టు బౌలింగ్ దళానికి వెన్నెముకగా ఉంటూ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. బుమ్రా ఆదాయ వివరాలు, లగ్జరీ లైఫ్ తదితర వివరాలను పరిశీలిద్దాం.
* 2019లో ఐసీసీ అవార్డ్
పదునైన యార్కర్లతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టించే బుమ్రా అతి తక్కువ సమయంలో భారత జట్టుకు మెయిన్ పేసర్‌గా ఎదిగాడు. అందుకు అతని వైవిధ్యమైన బౌలింగ్ యాక్షనే కారణం. 2019లో ఐసీసీ వన్డే ఇంటర్‌నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. క్రికెట్‌లో మేటి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా ఆదాయం పరంగా బాగా సంపాదిస్తున్నాడు.
* వార్షిక నికర విలువ రూ.55 కోట్లు
2023లో జస్‌ప్రీత్ బుమ్రా నికర విలువ $7 మిలియన్లు (రూ. 55 కోట్లు)ఉంటుందని ఓ అంచనా. బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఈ ప్లేయర్‌కు రూ.7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది. టెస్ట్, వన్డే, టీ20లకు ఒక్కో మ్యాచ్‌కు వరుసగా రూ. 15 లక్షలు, రూ. 6 లక్షలు, రూ.3 లక్షలు అందుకుంటున్నాడు. ఐపీఎల్ కోసం బుమ్రాను ముంబై ఇండియన్స్ రూ.12 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Rohit sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్తులు ఇవే..హైదరాబాద్ లో కూడా కోట్ల విలువైన ఆస్తి!
* భారీగా స్థిరాస్తుల కొనుగోలు
బుమ్రా ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. మీడియాలో పనిచేస్తున్న సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం, బుమ్రా పూణేలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడు. ఇక ముంబైలో సుమారు రూ. 2 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాన్ని సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లో రూ. 3 కోట్ల విలువైన బాల్కనీ గార్డెన్‌తో కూడిన ఖరీదైన ఇల్లు ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేశాడు.
* లగ్జరీ కారు కలెక్షన్
బుమ్రా గ్యారేజ్‌లో విలాసవంతమైన కార్లు చోటుదక్కించుకున్నాయి. రూ. 2.54 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ S50, రూ. 2.17 కోట్ల విలువ చేసే నిస్సాన్ GT-R, రూ. 90 లక్షల రేంజ్ రోవర్ వెలార్, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడల్స్ ఉన్నాయి.
గాలికాలుష్యంకు బెల్లంతో చెక్.. ఈ రెమిడీ మీకోసమే..
* ఎండార్స్‌మెంట్స్ వివరాలు
బుమ్రా బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పాటు వివిధ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ బాగా ఆర్జిస్తున్నాడు. అతని ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో డ్రీమ్ 11, వన్‌ప్లస్ వేరియబుల్స్, జాంగ్లీ, బోట్, రాయల్ స్టాగ్, కల్ట్ స్పోర్ట్, ఎస్ ట్రోలో, యూనిక్స్, భారత్ పే వంటి బ్రాండ్స్ ఉన్నాయి. కాగా, బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్, వివిధ బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్ తదితర వనరుల ఆధారంగా బుమ్రా వార్షిక నికర విలువను అంచనా వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
First appeared on telugu.news18.com